Adb: సొయా కొనుగోళ్ళలో దళారుల ఇష్టారాజ్యం
దళారుల నిలువు దోపిడీ పై కొరవడిన అధికారుల నిఘా....!? తేమ పేరిట నిలువు దోపిడీ.... గత్యంతరం లేక నష్ట పోతున్న రైతన్న గల్లీకొక సొయాకొనుగోలు దుకాణం..... రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటను రైతన్నల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం రైతుల పంట అమ్మకాల కోసం సౌకర్యాలు కల్పించడంలో విఫలం కావడంతో దళారులకు ఇదే వరంగా మారింది. ప్రభుత్వ ధరకు అధిక రేటులో కొంటున్నామని చెబుతూనే తేమ నాణ్యత పేరిట నిలువునా దళారులు దోచుకుంటున్నారు . అధికారులు ఈ ఇటు వైపు దృష్టి సారించాల్సింది పోయి ప్రభుత్వ ధర కంటే ఎక్కువ ధరకు కొంటున్నారు అని దళారుల దోపిడీకి పరోక్షంగా సహకారం...