ఫోన్ చోరీ.... డోంట్ వర్రీ....

◾️నాలుగు రోజుల్లో ఫోన్ రికవరీ చేసి కేసులు ఛేదిస్తున్న ఖాకీలు ◾️ప్రత్యేకత చాటుకుంటున్న ఆదిలాబాద్ పట్టణ పోలీసులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం : ‘ఫోన్ పోతే దొరకదు’ అన్న భావనను ఆదిలాబాద్ పట్టణ పోలీసులు చెరిపేస్తున్నారు. బాధితులు ‘మీ-సేవ’లో ఫిర్యాదు చేయగానే ఖాకీలు రంగంలోకి దిగుతున్నారు. పండుగలు, పబ్బాలు తేడా లేకుండా పని చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి యాక్షన్ తీసుకుంటున్నారు. నాలుగు నుంచి వారం రోజుల్లో కేసులను ఛేదిస్తున్నారు. మొబైల్ లను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. పోలీసులంటే ఆదిలాబాద్ పట్టణ ప్రజల్లో ఒక రకమైన భరోసాను నింపుతున్నారు. ఇటీవల టూ టౌన్ లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. మీ సేవలో...