క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుని అరెస్ట్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం అరెస్ట్ చేశారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొక్కలగూడా ప్రాంతం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడం తో సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలో ని బృందంతో కలిసి దాడి చేయగా నిందితుడు ముళ్ళ ఇమ్రాన్ (30)  ఒక బేకరీ నందు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డాడని తెలిపారు. ఇతని వద్ద నుండి రూ.30,500 ల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం...