ప్రత్తి పంటలో తలమాడు తెగుళ్ళ నివారణ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : ప్రస్తుత పరిస్థితులలో ప్రత్తి పంటలో చేయవలసిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ( ప్రత్తి ) డా. వి.తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్తి పంట 80 - 90 రోజుల దశలో ఉంది . రాష్ట్రంలోని వివిధ జిల్లాలో తలమాడు తెగులు ( టోబాకోస్ట్రీక్ వైరస్ ) పత్తి పంటను ఆశిస్తున్నట్లు గమనించడం జరిగింది . టోబాకోస్టిక్ వైరస్ సోకినా మొక్కలో కొమ్మల చివరి లేత ఆకులు పసుపు వర్ణానికి మారి చిన్నవిగా ఉంటాయి . వ్యాధి సోకినా కొమ్మల్లో ఎదుగుదల ఆగిపోయి గిడసబారుతాయి ....