పంటల సాగు పై రైతులకు అవగాహన ఏది....?
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతన్న...! రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : దేశానికీ అన్నం పెట్టె రైతన్నకు ఈ సంవత్సరం అంతగా కలిసి రాలేదు. ఓ పక్క భారీ వర్షాలకు భారీగా నష్టపోయాయినా రైతన్నలు కొందరుంటే , మరో పక్క ఎలాగోలా పంటను రక్షించుకున్నా వారు కొందరు. అయితే గ్రామాలలో, వ్యవసాయ క్షేత్రాలలో తిరిగి రైతులకు పంటల సాగు పై అవగాహన కల్పించాల్సిన మండల వ్యవసాయ శాఖ అధికారులు పత్తా లేకుండా ఉన్నారు. కాలాన్ని బట్టి, రైతుల పంట స్థితి ని బట్టి మందుల పిచికారీ మొదలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రతల పై అవగాహన కల్పించాల్సిన అధికారులు కరువయ్యారు.కొంతమంది వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు...