ADB: రెగ్యులర్ డాక్టర్ నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్
కాంగ్రెస్ నేతల నిరసన... అరెస్ట్... ఉద్రిక్తత..... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ గా డాక్టర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఆందోళనకు దారి తీసింది. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బేలా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేసేందుకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేల...