🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 18 Jul, 2022 | Page: 1

భారీ వర్షానికి కూలిన ఇల్లు --- తప్పిన పెను ప్రమాదం



రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగోండ మండలంలోని రోల్ మామడ గ్రామంలో కురుస్తున్న వర్షాలకు ఓ ఆదివాసి ఇల్లు నెలమట్టం అయింది. రోల్ మామడా గ్రామానికి చెందిన అత్రం రాములు అనే వ్యక్తి యొక్క ఇల్లు కూలి ఆస్తి నష్టం జరిగింది. ఇల్లు కూలిపోయే సమయానికి కుటుంబమంత పొలం పనులకు వెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఇంటి యజమాని అత్రం రాములు కోరారు.

🏠 Home