🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 15 Sep, 2021 | Page: 1

ఏకంగా ఊరి ప్రధాన కాలువ పైనే భవంతులు కట్టేశారు......


ఏళ్ళు గడుస్తున్నా చర్యతిసుకొని అధికారులు...



గతంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూల్చే ఆర్డర్ ఇచ్చిన అధికారులు.....



అక్రమ కట్టడాలు కూల్చివేత చేస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆపివేసిన వైనం ....




రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండల కేంద్రంలో ప్రధాన పెద్ద మురికి కాలువను మూసివేసి దాని పై పెద్ద పెద్ద భవంతులు కట్టేశారు. ఏ మాత్రం వర్షం పడిన ఇప్పుడు వర్షపు నీరు ఇళ్లలో చేరి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే విషయమై స్థానికులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.




ఈ రెండు ఫోటోలు చూడండి.... ఏకంగా చిన్న బ్రిడ్జ్ కి ఎదురుగా అంటే బ్రడ్జికి అనుకుని కాలువ పైనే కట్టిన నిర్మాణం



ఆ కట్టడాలు అక్రమ కట్టడాలని నిర్దారించిన అధికారులు వాటిని కూల్చివేతే కు ఆర్డర్ కూడా ఇచ్చేశారు. అప్పటి డిఎల్పీఓ సుదర్శన్ అక్రమించబడిన ప్రదేశాన్ని ప్రత్యేకంగా సందర్శించి , వెంటనే అక్రమంగా కట్టిన కట్టడాలు కూల్చేస్తామని పత్రిక ముఖంగా కూడా చెప్పారు.









గతంలో ఆదిలాబాద్ డిఎల్పీఓ ప్రధాన మురికి కాలువ పై ఉన్న అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి కులగొడతామని పేర్కొన్నా దృశ్యం ( ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తఅక్కడి కాలనీ వాసులు ఫిర్యాదు పై ఈ ఓ స్పందన గతంలో డిఎల్పీఓ వెళ్లిన దారిని ఎవరు వెళ్లకుండా తాళం వేసిన దృశ్యంగతంలో ఆదిలాబాద్ డిఎల్పీఓ సుదర్శన్ వెళ్లిన



కానీ ఆ ఆతర్వాత ఎం చక్రం తిరిగిందో కానీ అక్రమ కట్టడాలు అలాగే ఉన్నాయి.... వర్షాలు పడితే సామాన్యుల ఇంట్లో వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు.

🏠 Home