🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 04 Sep, 2021 | Page: 1

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత....REPUBLIC HINDUSTAN


రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా/ఉట్నూర్: అక్రమంగా కలప రవాణా చేస్తున్నారనే ముందస్తు సమాచారం రావడంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు కలప తరలిస్తున్న వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇచ్చోడా కేటీఆర్ జోన్ అటవీశాఖ క్షేత్ర అధికారి వహబ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం నెంబర్ లేని వాహనంలో కలప తరలిస్తున్నారనే సమాచారం రావడం తో ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద ముందస్తుగా గస్తీ చేపట్టారు. గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పెట్రోల్ బంక్ వద్ద ఓ వాహనం రావడం చూసి తనిఖీ చేయగా అందులో కలప దుంగలు ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ అధికారులను చూసి వాహన చోదకుడు పారిపోయినట్లు తెలిపారు. పట్టుబడిన కలప విలువ సుమారు ఒక లక్ష ఇరవై వేలు ఉంటుందని పేర్కొన్నారు.అక్రమ కలప రవాణా చేసిన నేరస్తుల ను త్వరలోనే పాటుకుంటామని అన్నారు. పట్టుబడిన వాహనాన్ని నిర్మల్ రేంజ్ కార్యాలయానికి పంపించారు. కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో షాంపూర్ ఎఫ్ఎస్ఓ అమర్ సింగ్, ఎఫ్ బి ఓ అచ్చన్న మరియు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

🏠 Home