🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 21 Jun, 2026 | Page: 1

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం : ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కొనిజర్ల, ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవము కొనిజర్లలోనే శ్రీ రామ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో యోగా ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ యోగా శారీరిక వ్యాయమేం కాకుండా, మానసిక ప్రశాంతత, శ్వాసను సమతుల్యం చేస్తుంది భావోద్వేగాలను నియంత్రిస్తుంది ఆత్మను పరమాత్మతో అనుసంధానిస్తుంది యోగా కేవలం శారీరిక వ్యాయామం కాదు ఇది సంపూర్ణ జీవన విధానం ఇది మనిషిని సంపూర్ణ వ్యక్తిత్వం గా తీర్చిదిద్ది మహోన్నత భారతీయ సంస్కృతి వైపు అడుగులు వేస్తుంది.అనేక రోగాలు రాకుండా ముందస్తుగా శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

యోగ ప్రతి ఒక్కరు కూడా జీవితంలో భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్టు B'day యోగా ఇన్స్పెక్టర్ సంధ్యారాణి మురళీకృష్ణ, నరేష్, ఆశ వర్కర్లు, కోయని రామారావు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home