ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, భూ సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం అత్యంత కీలకమని, బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను నిర్దేశిత గడువులోగా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 'భూ భారతి', సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.
జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ-అటవీ శాఖల భూ సరిహద్దు వివాదాల పరిష్కారానికి రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివాదాస్పద భూముల్లో వెంటనే జాయింట్ సర్వేలు నిర్వహించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చే కమ్యూనిటీ సర్టిఫికెట్ల దరఖాస్తులను ఎలాంటి ఆలస్యం లేకుండా నిబంధనల మేరకు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌ఎస్‌ఆర్ (RSR) ఎక్సెస్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులు, నిర్ణీత సమయంలోగా నివేదికలు సమర్పించని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆర్.ఎస్. చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్, కలెక్టరేట్ ఏఓ వర్ణ, సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.