🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 11 Sep, 2026 | Page: 1

కేంద్ర మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ సౌదీ అరేబియా పర్యటన విజయవంతం భారతీయులు సమస్యలపై కీలక వినతులు


రియాద్: భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖల సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ గారి సౌదీ అరేబియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత రాయబార కార్యాలయం, స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయ సమాజ ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు మరియు సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న భారతీయుల సమన్వయం, సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు సజావుగా నిర్వహించబడ్డాయి.

కేద్ర మంత్రి కార్యక్రమాలను సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత భారత రాయబార కార్యాలయ అధికారులు మరియు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమన్వయంతో చేపట్టి, ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు.

ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, సవాళ్లు మరియు ఇతర ముఖ్యమైన అంశాలను నేరుగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

భారతీయ సమాజం తరఫున ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మరిన్ని విమానాశ్రయాల అవసరం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ప్రయాణ సౌకర్యం మరియు కనెక్టివిటీ మరింత మెరుగుపడేందుకు సహాయం చేయాలనీ, దమ్మామ్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయులకు కాన్సులర్ సేవలు మరింత సులభంగా, అందుబాటులో ఉండేందుకు, వి ఫ్ యస్ అపాయింట్‌మెంట్ల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడం వీసా మరియు ఇతర సంబంధిత సేవలను పొందే వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్‌లో జాప్యం దీనివల్ల దరఖాస్తుదారులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, భారతీయ విద్యార్థులకు ఎన్ సి ఈ ఆర్ టి పాఠ్యపుస్తకాల అందుబాటులో జాప్యం సౌదీ అరేబియాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు పుస్తకాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం, ఇంజినీర్లు మరియు వైద్యుల విద్యార్హతలు, పరీక్షలు మరియు డిగ్రీల గుర్తింపు సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజినీర్స్ సౌదీ కమిషన్ ఫర్ హెల్త్ స్పెషాల్టీస్ నిర్దేశించే పరీక్షలు, డిగ్రీ మరియు ఇతర అర్హతలకు సంబంధించి భారతీయ నిపుణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భారతీయ సమాజ ప్రతినిధులు ఈ అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు మరియు సహకారం అందించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని
భారత రాయబార కార్యాలయ స్టీరింగ్ కమిటీ సభ్యులు కోరడం జరిగింది.

ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయ అధికారులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ భారత రాష్ట్రాల కమ్యూనిటీ ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు మరియు సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భారతీయులు హాజరయ్యారు.

వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు మరియు కమ్యూనిటీ సంస్థలకు చెందిన భారతీయులు ఒకే వేదికపైకి వచ్చి తమ సమస్యలను సమిష్టిగా ప్రస్తావించడం పట్ల విశేషంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమం భారతీయ సమాజంలోని ఐక్యత, సమన్వయం, సహకారం మరియు సమిష్టి ప్రాతినిధ్యానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.

భారతీయ సమాజ సభ్యులు తమ సమస్యలను స్వయంగా వినేందుకు సమయం కేటాయించి, వారి సమస్యలను తెలుసుకున్న కేద్ర మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, ఈ పర్యటన ద్వారా సౌదీ అరేబియాలోని భారతీయుల సంక్షేమానికి మరింత మద్దతు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేద్ర మంత్రి పర్యటన మరియు భారతీయ సమాజంతో జరిగిన పరస్పర సమావేశం భారత ప్రభుత్వం మరియు సౌదీ అరేబియాలోని భారతీయ సమాజం మధ్య మరింత మెరుగైన కమ్యూనికేషన్ మరియు సమన్వయానికి ఒక విలువైన వేదికగా నిలిచింది. అలాగే, సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం మరియు ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సమిష్టి సహకారం కొనసాగాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.
🏠 Home