సౌదీ అరేబియా రియాద్‌లో తుదిశ్వాస విడిచిన లక్ష్మీనారాయణ
గత నెలరోజులుగా మృత్యువుతో పోరాడి సౌదీ అరేబియా రియాద్‌లో తుదిశ్వాస విడిచిన లక్ష్మీనారాయణ
అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన బి. లక్ష్మీనారాయణ గారు సుమారు ఆరు నెలల క్రితం డ్రైవర్‌గా పనిచేయడానికి సౌదీ అరేబియాకు వచ్చారు. గత నెల 22వ తేదీన ఆయనకు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో, ఆయన స్పాన్సర్ రియాద్‌లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీ (KFMC) ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో ఆయన గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల సుమారు 90 శాతం వరకు బ్లాకేజీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఈ నెల 3వ తేదీన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు.
అయితే శస్త్రచికిత్స అనంతరం ఆయన కిడ్నీలు పనిచేయడం నిలిచిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. గత నెలరోజులుగా మృత్యువుతో తీవ్రంగా పోరాడిన లక్ష్మీనారాయణ గారు చివరకు కన్నుమూశారనే వార్త అత్యంత విషాదకరమని SATA , TASA, GTO, GIO ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో కొన్ని అంశాలను ప్రస్తావించక తప్పదని SATA , TASA, GTO, GIO ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు తాము అధికార పార్టీ నాయకులమని, APNRTSకు సంబంధించిన వ్యక్తులమని చెప్పుకుంటూ, లక్ష్మీనారాయణ గారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తులను బెదిరించడం, వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలను పలువురు తెలుగు ప్రజలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.
ఇలాంటి అత్యంత విషాదకర పరిస్థితుల్లో కూడా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, మానవత్వం కంటే వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వారు కోరారు.
ఈ విషయమై TASA (Telugu Association of Saudi Arabia) వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి) గారు మాట్లాడుతూ, ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో KFMC ఆసుపత్రి నుంచి ఒక వైద్యుడు తనకు ఫోన్ చేసి, లక్ష్మీనారాయణ గారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అత్యవసరంగా ఆసుపత్రికి రావాలని కోరారని తెలిపారు.
వెంటనే ఆఫీసు లో అనుమతి తీసుకుని ఆసుపత్రికి వెళ్లినట్లు స్వామి గారు తెలిపారు. అయితే అప్పటికే వైద్యుల బృందం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ లక్ష్మీనారాయణ గారిని కాపాడలేకపోయామని వైద్యులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త మహమ్మద్ షబ్బీర్ గారితో కలిసి లక్ష్మీనారాయణ గారి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఈ విషాద సమాచారాన్ని తెలియజేసినట్లు స్వామి గారు తెలిపారు. మహమ్మద్ షబ్బీర్ గారు మొదటి నుంచీ లక్ష్మీనారాయణ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, రాష్ట్రాలుగా విడిపోయినా మనమంతా తెలుగువారమే అనే మానవతా దృక్పథంతో ఆయన కుటుంబసభ్యులకు సహకరిస్తూ వచ్చారని పేర్కొన్నారు.
అదే సమయంలో, YSRCP నాయకుల ఆదేశాల మేరకు YSRCP సౌదీ అరేబియా కన్వీనర్ రబ్బానీ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో ఉండి కుటుంబసభ్యులకు సహకరించడం అభినందనీయమని పలు తెలుగు సంఘాల ప్రతినిధులు పార్టీలకు అతీతంగా కొనియాడారు.
అయితే, లక్ష్మీనారాయణ గారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినప్పటికీ, ఒక్క APNRTS కోఆర్డినేటర్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రికి వచ్చి కుటుంబసభ్యులకు అండగా నిలవకపోవడం, మృతదేహాన్ని మార్చురీకి తరలించడం వంటి కీలక ప్రక్రియల్లో సహకరించకపోవడం ఎంతో బాధాకరమైన విషయమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో లక్ష్మీనారాయణ గారి యజమాని బంధువు, ఆయనతో కలిసి పనిచేస్తున్న మరో డ్రైవర్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని, లక్ష్మీనారాయణ గారి పరిస్థితి గురించి స్వామి, మహమ్మద్ షబ్బీర్ మరియు రబ్బానీ గారిని మరియు వైద్యులను కూడా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో లక్ష్మీనారాయణ గారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను యజమాని బంధువుకు వివరించి, వారి సహాయం కోరినట్లు స్వామి, మహమ్మద్ షబ్బీర్ మరియు రబ్బానీ గారు తెలిపారు.
దీనికి యజమాని కుటుంబం వెంటనే స్పందిస్తూ, “లక్ష్మీనారాయణ మా కుటుంబసభ్యుడి లాంటి వారు. ఆయన కుటుంబానికి మేము అండగా ఉంటాము” అని భరోసా ఇవ్వడం తమకు ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందని స్వామి గారు తెలిపారు.
మరోవైపు, కొందరు వ్యక్తులు లక్ష్మీనారాయణ గారి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, తాము ప్రభుత్వ అధికారులమని, మరికొందరు తాము ఇండియన్ ఎంబసీ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుని, మృతదేహాన్ని భారత్‌కు పంపించే ప్రక్రియకు సంబంధించి తమ పేరుతో అఫిడవిట్ ఇవ్వాలని కోరినట్లు కుటుంబసభ్యులు తెలిపిన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి అత్యంత విషాద సమయంలో బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాల్సింది పోయి, వ్యక్తిగత లేదా ప్రచార ప్రయోజనాలకు అవకాశం కల్పించడం అత్యంత విచారకరమని పలువురు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మీనారాయణ గారు అనారోగ్యంతో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో 11 రోజులపాటు ఆయనను పరామర్శించడానికి రాని వ్యక్తులు, ఆయన మరణించిన విషయం తెలిసిన తరువాత కూడా సాయంత్రం వరకు ఆసుపత్రికి రాని వ్యక్తులు, ఇప్పుడు మృతదేహాన్ని భారత్‌కు పంపించే ప్రక్రియలో తమ పేరుతో అఫిడవిట్ ఇవ్వాలని కోరడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే విషయాన్ని తెలుగు సమాజం, సామాజిక కార్యకర్తలు మరియు పలు తెలుగు సంఘాలు గమనిస్తున్నాయని పలువురు తెలిపారు.
ఈ ఘటన మనందరికీ ఒక గుణపాఠంగా నిలవాలని వారు పేర్కొన్నారు. విషాద సమయంలో రాజకీయాలకు, వ్యక్తిగత ప్రచారానికి, స్వార్థ ప్రయోజనాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మానవత్వంతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడమే నిజమైన సేవ; ఆ సేవకు రాజకీయ రంగు పులమడం మాత్రం సమంజసం కాదని పలువురు పేర్కొన్నారు.
“మన తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా, విషయం తెలిసిన వెంటనే పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో సహాయం చేసేందుకు ముందుంటాం” అని SATA రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ గారు తెలిపారు.
లక్ష్మీనారాయణ గారిని మొదటగా పరామర్శించిన SATA ప్రతినిధి సింగు నరేష్ కుమార్‌తో పాటు SATA ప్రతినిధులు నూరుద్దీన్, కాజా ముజమ్మిల్ ఉద్దీన్, ముదిగొండ శంకర్, హైమద్ అబ్దుల్ కరీమ్, లోకేష్ కోకిల మరియు ఇతర SATA ప్రతినిధులు కూడా ఆయన కుటుంబానికి తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
అలాగే, లక్ష్మీనారాయణ గారి విషయంలో తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులమని, APNRTS ప్రతినిధులమని చెప్పుకుంటూ శోకసముద్రంలో ఉన్న కుటుంబసభ్యులతో వ్యవహరించిన తీరుపై సౌదీ అరేబియాలోని పలు తెలుగు సంఘాలు, తెలుగు ప్రజలు మరియు సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.
ఇలాంటి విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యతను విస్మరించడం అత్యంత బాధాకరమని, మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించడం సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్న నేపథ్యంలో, APNRTS ద్వారా పెద్ద సంఖ్యలో కోఆర్డినేటర్లను నియమించినప్పటికీ, ఒక తెలుగు వ్యక్తి విదేశీ గడ్డపై ప్రాణాలతో పోరాడుతున్న సమయంలోనూ, అనంతరం మృతి చెందిన సమయంలోనూ ఆయనను పరామర్శించడానికి ఒక్క కోఆర్డినేటర్ కూడా సాయంత్రం వరకు ఆసుపత్రికి రాకపోవడం బాధాకరమైన విషయమని పలువురు తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు.
ప్రవాసాంధ్రుల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు కేవలం పదవులు, హోదాలు, ప్రచారం కోసం కాకుండా, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ఉపయోగపడాలని తెలుగు ప్రజలు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒక తెలుగు వ్యక్తి విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోయినప్పుడు పార్టీలకు అతీతంగా, మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పలు తెలుగు సంఘాలు, సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.
లక్ష్మీనారాయణ గారి మృతికి SATA , TASA, GTO, GIO ప్రతినిధులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబసభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.