🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 12 Aug, 2026 | Page: 1

సౌదీ అరబియాలో భారత నూతన రాయబారికి సాటా మరియు టాసా హృదయపూర్వక శుభాకాంక్షలు

# సౌదీ అరేబియాలో భారత నూతన రాయబారిగా శ్రీ విపుల్ బాధ్యతల స్వీకరణ

*రియాద్:* సౌదీ అరేబియాలో భారత నూతన రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త శ్రీ విపుల్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించింది.

1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన శ్రీ విపుల్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 2న సౌదీ అరేబియాలో తదుపరి భారత రాయబారిగా నియమించింది. భారత్–సౌదీ దౌత్య సంబంధాలు ప్రారంభమైన అనంతరం ఈ కీలక బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లిమేతర భారతీయ రాయబారిగా శ్రీ విపుల్ నిలిచారు.

### ఖతార్ నుంచి సౌదీ అరేబియాకు

సౌదీ అరేబియాలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు శ్రీ విపుల్ సుమారు మూడు సంవత్సరాల పాటు ఖతార్‌లో భారత రాయబారిగా సేవలందించారు. ఆయన పదవీకాలంలో భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాల్లో మరింత బలోపేతమయ్యాయి.

జూలై 31న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నుంచి సౌదీ అరేబియాలో భారత రాయబారిగా తన నియామకానికి సంబంధించిన అధికారిక గుర్తింపు పత్రాలను స్వీకరించిన శ్రీ విపుల్, భారత్–సౌదీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

### భారతీయ ప్రవాసుల సంక్షేమానికి ప్రాధాన్యత

సౌదీ అరేబియాలోని భారతీయ ప్రవాస సంఘాలు శ్రీ విపుల్ బాధ్యతల స్వీకరణను స్వాగతించాయి. SATA మరియు TASA సంస్థలు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సౌదీలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రత మరియు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించాయి.

ప్రత్యేకంగా వీసా, పాస్‌పోర్ట్, కార్మిక సమస్యలు, అత్యవసర పరిస్థితులు, కాన్సులర్ సేవలు తదితర అంశాల్లో భారతీయ ప్రవాసులకు వేగవంతమైన సహాయం అందేలా సంబంధిత సౌదీ అధికారులతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సంఘాలు ప్రస్తావించాయి. భారతీయుల హక్కులు, సంక్షేమం మరియు భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని కోరాయి.

భారత్–సౌదీ అరేబియా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న స్నేహపూర్వక, వ్యూహాత్మక సంబంధాలు శ్రీ విపుల్ నాయకత్వంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని భారతీయ ప్రవాస సంఘాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.

### SATA & TASA అభినందనలు

శ్రీ విపుల్‌కు సౌదీ అరేబియాలో విజయవంతముగా, ప్రజలకు అందుబాటులో ఉండే సేవాకాలం అందాలని SATA వ్యవస్థాపకులు *మల్లేశన్*, వివిధ ప్రాంతాల అధ్యక్షులు *శ్రీనివాస్ మచ్చ, శార్వాణి విద్యాధరణి*, కోర్ టీమ్ సభ్యులు *కోకిల ఒతులూరి, అర్షియా బేగం, ప్రీతి చౌహాన్, నరేష్ కుమార్ సింగు, యోగేశ్వరరావు వీరవల్లి, అహ్మద్ అబ్దుల్ కరీమ్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తల్లా, అహ్మద్ మొహియుద్దీన్, రోజధర్ సయ్యద్ (అస్లాం), పెంటపాటి శ్రీచరణ్, దూడం సంజీవ్, శేఖర్ పడాల, షేక్ అస్లాం పాషా* తదితరులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా TASA వ్యవస్థాపక అధ్యక్షులు *తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి)*, రియాద్ అధ్యక్షులు *మురారి తాటికాయల*, ఉపాధ్యక్షులు *మహేంద్ర వాకాటి*, ముఖ్య కోర్ టీమ్ సభ్యులు *ఇబ్రహీం షేక్, నటరాజ్, భాస్కర్, అనిల్ మర్రి, అజయ్, ఖాదర్ షేక్, శివ, మణికంఠ, రామ్ మద్దుకూరి, రవి, శ్రీదేవి, బిందు, హేమ, మణి, సింధు, విద్య* మరియు ఇతర సభ్యులు శ్రీ విపుల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

భారత్–సౌదీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సౌదీ అరేబియాలోని భారతీయ ప్రవాసుల సంక్షేమం, భద్రత మరియు సమస్యల పరిష్కారంలో శ్రీ విపుల్ విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన భవిష్యత్ బాధ్యతల్లో మరింత విజయాన్ని సాధించాలని, ప్రజలకు మరింత చేరువైన రాయబారిగా సేవలందించాలని *SATA* మరియు *TASA* కుటుంబాలు మరియు తెలుగు ప్రజలు ఆకాంక్షయించాయి.
🏠 Home