సాత్నంబర్‌గావ్ లో తల్లిపాల వారోత్సవం సందర్భంగా గర్భిణులకు సీమంతం
ఆదిలాబాద్ : నర్సాపూర్ సెక్టార్ పరిధిలోని సత్నంబర్‌గావ్ గ్రామంలో తల్లిపాల వారోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు ఘనంగా సీమంత కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ జాదవ్ విమల మాట్లాడుతూ, ప్రతి శిశువుకు జననం జరిగిన గంటలోపే తల్లి ముర్రుపాలు (కొలస్ట్రం) పట్టించడం అత్యంత అవసరమని తెలిపారు. ముర్రుపాలే శిశువుకు మొదటి టీకా వంటివని, పుట్టిన వెంటనే తేనె, నీరు లేదా ఇతర పదార్థాలు ఇవ్వకూడదని సూచించారు.
శిశువుకు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలలు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రంలో అందించే బాలామృతాన్ని రోజుకు 100 గ్రాముల చొప్పున ఆహారంగా అందించాలని చెప్పారు. అలాగే రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల ఎదుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని వివరించారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకే కాకుండా తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా గర్భకోశ సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని జాదవ్ విమల తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ రాథోడ్ రమేష్, గ్రామ పెద్దలు, నర్సాపూర్ అంగన్‌వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.