నిస్సహాయుడికి చేయూత... మానవత్వాన్ని చాటిన ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ
ఆదిలాబాద్ , ప్రతినిధి : మతాలకు అతీతంగా మానవ సేవే మహోన్నతమైనదనే సందేశాన్ని ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆచరణలో చూపించారు. సమాజ సేవలో భాగంగా సోషల్ వర్కర్ ముబారక్ ఆధ్వర్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు.
వివరాల్లోకి వెళితే, రాజు అనే వ్యక్తి మానసిక ఆరోగ్యం సరిగా లేక, ఆధారం లేకుండా మురికిగా, దయనీయ స్థితిలో జీవిస్తున్నాడు. అతని వద్దకు వెళ్లడానికి కూడా చాలామంది వెనుకంజ వేస్తున్న పరిస్థితిని గమనించిన ఆల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ముందుకు వచ్చారు.
వారు రాజుకు తల గుండు చేయించి, స్నానం చేయించి, పూర్తిగా శుభ్రం చేసి, కొత్త బట్టలు తొడిగించి, గౌరవప్రదంగా ప్రజల మధ్యకు తీసుకువచ్చారు. ఈ సేవ ద్వారా ఒక నిస్సహాయుడికి కొత్త జీవితం అందించడంతో పాటు, సమాజానికి మానవత్వం, ప్రేమ, సేవాభావం అనే గొప్ప సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా సోషల్ వర్కర్ ముబారక్ మాట్లాడుతూ, "మంచి పనులు చేయండి... మతం చూడకండి... అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేయూతనివ్వండి. ప్రతి ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరగాలని మా ఆకాంక్ష. మానవత్వమే అన్ని మతాల కంటే గొప్పది" అని పేర్కొన్నారు.
ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మరింత అవగాహన పెంచి సేవాభావాన్ని ప్రోత్సహిస్తాయని అభిప్రాయపడ్డారు.