కేటీఆర్ జన్మదినం సందర్భంగా దుబాయ్‌లో ఘనంగా రక్తదాన శిబిరం
దుబాయ్, జూలై 24, 2026:
ప్రజా సేవకు ప్రతీకగా నిలిచే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, LSPMK గ్రూప్ ఛైర్మన్ శ్రీ సత్యం రాధారపు మరియు స్పెక్ట్రమ్ గ్రూప్ వ్యవస్థాపకులు సీఏ బాలరాం రెడ్డి ఆధ్వర్యంలో, LSPMK గ్రూప్ మరియు స్పెక్ట్రమ్ ఆడిటింగ్ సంయుక్తంగా దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) సహకారంతో దుబాయ్ బ్లడ్ డొనేషన్ సెంటర్, అల్ జద్దాఫ్ లో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
"గిఫ్ట్ ఆఫ్ లైఫ్" అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూఏఈలోని తెలుగు ప్రజలు, భారతీయులు మరియు ఇతర దేశాలకు చెందిన వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
ఒక యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడగలదనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా LSPMK గ్రూప్ ఛైర్మన్ శ్రీ సత్యం రాధారపు మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో కేటీఆర్ జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే స్పెక్ట్రమ్ గ్రూప్ వ్యవస్థాపకులు సీఏ బాలరాం రెడ్డి మాట్లాడుతూ, రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని, ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) అధికారులకు, రక్తదాతలకు, వాలంటీర్లకు, అలాగే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలు అందించిన ది లెమన్ స్టూడియో బై రమేష్ బృందానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
"ఒక్క రక్తదానం... ఎన్నో ప్రాణాలకు జీవదానం. ప్రతి చుక్క రక్తం అమూల్యమైన ప్రాణాలను కాపాడుతుంది."