సౌదీ అరబియాలో సాటా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
తెలుగు భాషా దినోత్సవం (TBD) – తేది 18 సెప్టెంబర్ 2026 వేడుకల సందర్భంగా
2026 జూలై 23, గురువారం, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం (TBD) తేది 18 సెప్టెంబర్ 2026 వేడుకలలో భాగంగా నిర్వహించిన సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది.
ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్లు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు సమన్వయాన్ని ప్రదర్శించి పోటీలను విజయవంతం చేశాయి. నిర్ణయించిన మ్యాచ్‌లలో ఎక్కువ భాగం విజయవంతంగా పూర్తికావడంతో ఈ కార్యక్రమం అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది.
సౌదీ అరేబియాలోని తెలుగు సమాజం కోసం మొట్టమొదటిసారిగా నిర్వహించిన నైట్ క్రికెట్ టోర్నమెంట్ కావడం విశేషం. ఈ టోర్నమెంట్ ద్వారా సమాజంలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబడింది. పాల్గొన్న ఆటగాళ్లందరికీ తాగునీరు మరియు అవసరమైన ఇతర సౌకర్యాలను నిర్వాహకులు సమకూర్చారు.
ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన అన్ని జట్లు, జట్టు కెప్టెన్లు, ఆటగాళ్లు, వాలంటీర్లు, అభిమానులు మరియు సహకారులందరికీ సాటా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది.
ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, మహమ్మద్ నూరుద్దీన్, సింగు నరేష్ కోర్ టీం సభ్యులను సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
వీరికి సాటా వ్యవస్థపాకుల మల్లేశన్ మరియు రియాద్ చాప్టర్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ పూర్తి మద్దతు అందించారు.
అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రోత్సాహం అందించిన వీరపల్లి యోగేష్ బాబు, అహ్మద్ షహబాజ్ (హల్చల్ కేఫ్), సురేష్, శంకర్ తో పాటు సాటా కోర్ టీమ్ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు.
అదేవిధంగా TASA వ్యవస్థాపకులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి) మరియు కోర్ టీం ఇబ్రహీం విచ్చేసి తమ మద్దతు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షిహాబ్ కొట్టుకాడ్ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఆటగాళ్లను, నిర్వాహకులను ప్రోత్సహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ చారిత్రాత్మక నైట్ క్రికెట్ టోర్నమెంట్ విజయాన్ని దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు సాటా కట్టుబడి ఉందని తెలియజేస్తోంది. ధన్యవాదాలతో
సాటా రియాద్ కోర్ టీమ్