🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 15 May, 2025 | Page: 1

పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్



ఎఆర్ లో  7 గురుకి కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి..



పదోన్నతి పొందిన అధికారులకు నిర్మల్ మరియు జగిత్యాల్ జిల్లాలకు బదిలీ.



పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.




ఆదిలాబాద్ :  పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. గురువారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు  ఏఆర్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి పొందుతున్న 7 మంది అధికారులను పోలీసు ముఖ్య కార్యాలయానికి ఆహ్వానించి భుజాలకు పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలియజేశారు.




పదోన్నతి పొందిన అధికారులు :
ఎన్ కిషన్ రావు, ఎం అశోక్, జే దుదిరామ్, ఆర్ గోవింద్, ఎల్ దినేష్, ఎన్ అరవింద్, ఆర్ రామారావు లు ఉన్నారు. వీరందరికీ జిల్లా ఎస్ పీ పదోన్నతి పొందిన శుభ సంతోషం సమయంలో శుభాకాంక్షలు తెలియజేశారు. వీరందరికీ జోన్ పరిధిలో ఉన్న నిర్మల్ మరియు జగిత్యాల జిల్లాలలో ఖాళీలను బట్టి బదిలీలు కావడం జరిగింది.




ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్ రావు, సీసీ కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🏠 Home